Primerను డౌన్‌లోడ్ చేయడం సులభం. లేదా

Primer

Primer పరిచయం

Primer అనేది Google అందిస్తోన్న ఉచిత మొబైల్ యాప్, ఇది వ్యాపార యజమానులకు, వ్యాపారం మరియు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారికి త్వరగా, సులభంగా అర్థం చేసుకోగల పాఠాలను అందిస్తుంది.

విశ్వసనీయ పరిశ్రమ నిపుణుల నుండి సేకరించిన లోతైన ఆలోచనలను కఠిన పదాలు లేకుండా ఇంటరాక్టివ్‌‍గా ఉండే పాఠాల రూపంలో నేర్పుతుంది. ఇందులో ఆచరించదగ్గ 'తర్వాతి దశలు' కూడా ఉంటాయి. వీటి ద్వారా మీ బిజినెస్ లేదా కెరీర్ లక్ష్యాలను చేరుకోవచ్చు. ఈ పాఠాలను పూర్తి చేయడానికి 5 నిమిషాలు లేదా అంత కంటే తక్కువ సమయం పడుతుంది. వీటిలో ఇమెయిల్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, మీ ఆదాయ వ్యయాల నిర్వహణ వంటి అంశాలు ఉండటంతో పాటు ఎన్నో కొత్త అంశాలు నిత్యం జోడించబడుతూ ఉంటాయి.

నేర్చుకోవడం మొదలుపెట్టడానికి, యాప్‌ను మీ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత, ఉన్న అంశాలలో నుండి ఒక దాన్ని ఎంచుకుని అందులో మీకు, మీ బిజినెస్‌కు, మీ కెరీర్‌కు తగిన పాఠాలను ఎంచుకోండి.

ప్రజల అభిప్రాయం

“ఆశ్చర్యకరమైన యుఐ మరియు హాస్యంతో అందంగా, బాగా వర్ణించిన విషయాలు ఉచితమా? మీరు కనీసం వీటికి ఒక్క పైసా కూడా తీసుకోవటం లేదా? ఆశ్చర్యం! తమ ఆలోచనల్ని విస్తరించి తెలుసుకోవటానికి కెటలిస్ట్ అవసరమైన ప్రజలకు ఈ యాప్ ఒక బహుమతి. Google నీకు అభినందనలు!”

— Ashish S.

“చాలా ప్రభావవంతమైనది. ఈ యాప్ ద్వారా నేను ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రారంభించాను. ఆన్ లైన్ మార్కెటింగ్ లో ఇది నా మొదటి శిక్షణ.”

— Nishi K.

“వ్యాపార ఆలోచన కలగటంనుంచి బ్రాండింగ్, ఆన్ లైన్ లో ప్రకటన, సేల్స్ చేయటంవరకు మెళుకువలు. 5 లేదా అంతకంటే తక్కువ నిముషాల్లోనే అంశాల్ని తక్కువ పాఠాలు  సులభంగా నేర్చుకునేలా చేస్తాయి. ఎంతో సృజనాత్మకమైనవి మరియు నిమగ్నం చేసేవి. మై కాఫీ బ్రేక్ యాప్ గా మారవచ్చు.”

— Pradhumn A.

“ఈ యాప్ ఇష్టపడ్డారా! మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువగానే మీరు నేర్చుకుని, ఉపయోగించగలరు.”

— Hamendra C.

“ఈ యాప్ ఎంతో సహాయకరం. నేను ఇప్పుడే సేల్స్ ఉద్యోగం ఆరంభించాను, ఈ యాప్ మరియు దాని ఆశ్చర్యకరమైన కంటెంట్ నాకు ఎంతో సహాయపడుతోంది.”

— Drishti C.

“ఇది అద్భుతం. ఇది వరకు నేను ఇలాంటిది చూడలేదు. తెలివిగా నిర్వహించబడిన అద్భుతమైన కంటెంట్ తో సాటిలేని యుఐ. ఆన్ లైన్ వ్యాపారంలో మీరు ప్రేరేపణ కోసం చూస్తే మీరు తప్పనిసరిగా దీన్ని ప్రయత్నించాలని నా సలహా. డిజిటల్ మార్కెటింగ్ కి మీరు కొత్త అయితే ఇది మీ మనస్సుని ఉత్సాహపరుస్తుంది. Google మరోసారి నన్ను ఆశ్చర్యపర్చింది.”

— Jithil J.