Primerను డౌన్‌లోడ్ చేయడం సులభం. లేదా

Primer

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర:

Google Primer ఖరీదు ఎంత?

స:

Primer యాప్‌తో పాటు, అందులోని పాఠాలన్నీ కూడా పూర్తిగా ఉచితం.

ప్ర:

Primer ఎవరి కోసం ఉద్దేశించినది?

స:

ఉపయోగకరమైన బిజినెస్ నైపుణ్యాలను నేర్చుకుందామని అనుకునే ప్రజలు, ఉదాహరణకు చిన్న బిజినెస్‌ను మొదలుపెట్టిన వాళ్లు, ఎప్పటి నుండో బిజినెస్‌ను నడుపుతున్న వాళ్లు, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్లు, విద్యార్థులు, బ్రాండ్ మేనేజర్లు అందరి కోసం రూపొందిన యాప్ Primer.

ప్ర:

మీరు ఏ విషయాలు కవర్ చేస్తారు?

స:

మీ వ్యాపార నైపుణ్యాలు, మీ రెజ్యూమ్‌ను మరింత మెరుగుపరచడానికి, వ్యాపార ప్రణాళిక, డిజిటల్ మార్కెటింగ్, అమ్మకం, ఫైనాన్స్ ఇంకా మరెన్నో విషయాలపై Primer పాఠాలు అందిస్తుంది. మా నైపుణ్యాల పూర్తి జాబితా కోసం, మా పాఠాల క్యాటలాగ్‌ను చూడండి.

ప్ర:

పాఠాలను కనుగొనడం ఎలా?

స:

Primer పాఠాలను వెతకడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి:

మీరు ఎంచుకున్న నైపుణ్యాల ఆధారంగా మీ కోసం సిఫార్సు చేసిన పాఠాలను చూడటానికి, 'హోమ్' స్క్రీన్‌కు వెళ్లండి.

Primer టీం ఎంపిక చేసిన పాఠాలను చూడటానికి, 'అన్వేషణ' స్క్రీన్‌కు వెళ్లండి. కొత్త పాఠాలను లాంచ్ చేసినప్పుడు అప్‌డేట్స్ పొందాలనుకుంటే, 'సెట్టింగ్‌లు' ట్యాబ్‌లో నోటిఫికేషన్‌లను ఆన్ చేయగలరు.

చివరి మార్గం ఏమిటంటే, యాప్‌లో ఎగువున ఉండే సెర్చ్ బార్‌లో నిర్దిష్ట పాఠాలను, నైపుణ్యాలను లేదా టాపిక్‌లను మీరు సెర్చ్ చేయవచ్చు.

ప్ర:

నేను Primerలో నేర్చుకున్నవి షేర్ చేయడం ఎలా?

స:

Primer పాఠాలు, పాఠాల కార్డులు, ప్రధాన అంశాలు, ఆచరించగల తర్వాతి దశలు వంటివి అన్నీ షేర్ చేయవచ్చు. తద్వారా మీరు నేర్చుకున్న అంశాలను మీరు మీ కొలీగ్‌లు, స్నేహితులు ఆచరణలో పెట్టవచ్చు. ఏదైనా పాఠాన్ని పంపడానికి లేదా షేర్ చేయడానికి, 'పాఠాల రీక్యాప్' పేజీ ఎగువన ఉండే బాణం గుర్తును ఎంచుకోండి, లేదా ఆ పాఠానికి చెందిన ముఖ్యమైన అంశాలను లేదా తర్వాతి దశలను పంపడానికి లేదా షేర్ చేయడానికి దిగువకు స్క్రోల్ చేయండి. ఏదైనా నిర్దిష్ట పాఠం కార్డును పంపడానికి లేదా షేర్ చేయడానికి ఆ కార్డు ఎగువున ఉండే బాణం గుర్తును ఎంచుకోండి.

ప్ర:

నేను పిన్ చేసిన కార్డులు ఎక్కడ ఉంటాయి?

స:

ప్రత్యేకంగా ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటే, దానిని పిన్ చేయడం వల్ల, పాఠం మొత్తం మళ్లీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఆ సమాచారాన్ని తిరిగి పొందవచ్చని కొందరు భావిస్తారు.

మీరు పిన్ చేసిన కార్డులను చూడటానికి, 'సేవ్ చేసినవి' ట్యాబ్‌కు వెళ్లి 'పిన్ చేసినవి' అనే విభాగాన్ని ఎంచుకోండి.

ప్ర:

Primerలో పాఠాలు ఎవరు రూపొందిస్తారు?

స:

అన్ని స్థాయిలలోని వినియోగదారులు నేర్చుకోవడానికి అందుబాటులో ఉండేలా మా బృందం ఆహ్లాదకరమైన, ఇంటరాక్టివ్ పాఠాలను కష్టమైన వ్యాపార పరిభాషలో లేని అంతర్దృష్టులను, జ్ఞానాన్ని సేకరిస్తుంది. ఇందుకు, Google మరియు ఇతర సంస్థలకు చెందిన నిపుణులతో Primer భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది.

ప్ర:

భాషను మార్చడం ఎలా?

స:

Primer ప్రస్తుతం ఈ భాషలలో అందుబాటులో ఉంది - ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, బహాసా, హిందీ, తెలుగు, వియత్నమీస్. Primer భాష మీ ఫోన్‌లోని భాషా సెట్టింగ్‌లకు లింక్ అయి ఉంటుంది - ఉదాహరణకు, మీరు యాప్‌ను పోర్చుగీస్‌లో వాడాలనుకుంటే, మీ ఫోన్‌లోని భాషా సెట్టింగ్‌లను పోర్చుగీస్‌కు మార్చండి, యాప్ ఆటోమేటిక్‌గా భాషను మార్చుకుంటుంది. ఇది పనిచేయకపోతే, యాప్‌ను మూసివేసి తిరిగి ప్రారంభించి చూడండి.

ప్ర:

ఎంత తరచుగా మీరు యాప్‌ను అప్‌డేట్ చేస్తారు?

స:

మేము క్రమం తప్పకుండా కొత్త పాఠాలను జోడిస్తూ, ఎల్లప్పుడూ మా యాప్‌ను మెరుగుపరుస్తూ ఉంటాము. మీరు Primer అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ ప్రొఫైల్‌లోని సెట్టింగ్‌ల విభాగంలో మొబైల్ లేదా ఇమెయిల్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయవచ్చు.

ప్ర:

Primer పాఠాలను పూర్తి చేసినందుకు నాకు సర్టిఫికేషన్ వస్తుందా?

స:

Primer ప్రస్తుతం ఎటువంటి సర్టిఫికేషన్ అందించదు కానీ మా పాఠాల ద్వారా మీరు పొందిన జ్ఞానంతో మీరు విలువైన వ్యాపార, మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు, వీటిని మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా వృద్ధి చేయడానికి లేదా కొత్త ఉద్యోగాన్ని కనుగొనటానికి ఉపయోగించవచ్చు.

ప్ర:

Primerకు డెస్క్‌టాప్ వెర్షన్ ఉందా?

స:

మా పాఠాలను మొబైల్ యాప్ కోసమే రూపొందించాము, తద్వారా అవి చిన్నగా, ఇంటరాక్టివ్‌గా, మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా పూర్తి చేయగలిగేలా ఉంటాయి. అయినా, మేము నిరంతరంగా అప్‌డేట్ చేస్తూ, కొత్త ఫీచర్‌లను జోడిస్తూనే ఉంటాము - Primer అప్‌డేట్‌ల గురించి వినాలనుకుంటే, మీరు మొబైల్ లేదా ఇమెయిల్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయవచ్చు.

ప్ర:

ఒక పాఠం గురించి నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని మీతో పంచుకోవడం ఎలా?

స:

మీ ఐడియా వినడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నాము. hello@yourprimer.com వద్ద మాకు ఒక మెసేజ్ పంపండి.