Primerను డౌన్‌లోడ్ చేయడం సులభం. లేదా

Primer

వీడియో చూడండి

Tsar వాచెస్ స్త్రీలు, పురుషుల కోసం హస్త కళా నైపుణ్యంతో చేసిన ప్రీమియం చెక్క వాచీలు

Tsar వాచెస్ అనేది, అద్వితీయంగా తీర్చిదిద్దబడిన ఉడెన్ వాచ్‌ల (చెక్క గడియారాలు) ఆన్‌లైన్ షాప్‌, దీని ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాచ్‌లు డెలివర్ చేయబడతాయి. వ్యాపారవేత్తల కుటుంబంలో పుట్టి పెరిగిన వర్ధమాన పారిశ్రామికవేత్త అయిన అబ్దుల్‌కు ప్రాథమిక స్థాయి వ్యాపార సూత్రాలు మాత్రమే తెలుసు. తన వ్యాపారానికి ఒక బ్రాండ్ ఇమేజ్ రూపొందించడం, కొత్త కస్టమర్లను కనుగొనడం, డిజిటల్ మార్కెట్‌లో వ్యాపారాన్ని ప్రచారం చేయడం వంటి విషయాల్లో ఎంతో కష్టపడ్డారు. తన వ్యాపారాన్ని ఒకవైపు నిర్వహిస్తూనే, మరోవైపు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేందుకు సులభమైన, సౌకర్యవంతమైన పరిష్కారం ఏదైనా ఉంటే బాగుండు అనుకునేవారు. ఆన్‌లైన్ వ్యాపారాభివృద్ధిని సుసాధ్యం చేసే Primerను ఆశ్రయించి, దాని ద్వారా కీలకమైన మార్కెటింగ్ ఇన్‌సైట్స్ నేర్చుకుని అమలుచేశారు, తద్వారా వారి వ్యాపారానికి మరింత విలువ జోడించారు.

Primerలోని వివిధ పాఠాలను (పర్సనల్ బ్రాండింగ్, PR, అనలిటిక్స్ లాంటివి) అమలుచేసి, తన వ్యాపారాన్ని రెండింతలు వృద్ధి చేసుకోగలిగారు. అనలిటిక్స్ పాఠంలోని Abandoned cart అనే ఫీచర్ గురించి తెలుసుకున్న ఆయన, తన వ్యాపార వెబ్‌సైట్‌లో ప్రోడక్టుల కొనుగోళ్లను ప్రారంభించి, వాటిని మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన కస్టమర్లకు, రిమైండర్ ఇమెయిల్స్ పంపించడం ద్వారా 40% అమ్మకాలను తిరిగి పొందగలిగారు. మరొక సందర్భంలో, Influencer marketing అనే పాఠం నేర్చుకున్న ఆయన రైట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను (right influencers) ఎలా లక్ష్యంగా చేసుకోవాలో తెలుసుకున్నారు. తన ప్రోడక్టుల గురించి స్థిరమైన PR ప్రచారం ద్వారా, వెబ్‌సైట్‌ యొక్క సహజ ట్రాఫిక్‌లో పెరుగుదలను చూశారు.